జీవశాస్త్రము అనగా జీవుల అధ్యయనం
BIOLOGY అనే పదానికి గ్రీకు భాషలో అర్థం
BIOS-జీవులు
LOGOUS -అధ్యయనం
Biology అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించినది "లామర్క్ "
మొదటగా లిఖిత పూర్వక ఆధారాలు ఇచ్చింది" అరిస్టాటిల్" మరియు" గాలెన్ "
తర్వాత 2000 సం ‼️ ల ఎటువంటి శాస్త్ర ప్రగతి జరగలేదు . కావున ఈ కాలాన్ని "శాస్రానికి చీకటి యుగం " అంటారు .
తర్వాత జీవశాస్త్రము పునర్జీవనానికి కృషి చేసింది -"విలియం హార్వే ".,"వేశాలియస్
అరిస్టాటిల్
⇒Father of biology &zoology
⇒ ఇతను గ్రీకు దేశస్తుడు
⇒ఇతను జీవుల వర్గీకరణలో మొదటిసారిగా క్రమపద్ధతిని పాటించాడు
⇒ప్రపంచంలో మొదటగా "శాస్త్రీయ విధానాన్ని "అవలంబించారు
⇒ఇతను కోళ్ల పిండాభివృద్ది పై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలే ఆధునిక "పిండోత్పత్తి శాస్రానికి "నాందిగా నిలిచాయి .
విలియం హార్వే
ఇతను బ్రిటిష్ డాక్టర్
ఇతను గుండె ,రక్తప్రసరణపై పరిశోదలు చేసి ,రక్తప్రసరణ విధానానికి పితామహుడిగా పేరు పొందాడు
గుండె నుండి శరీర భాగాలకు,శరీర భాగాల నుండి గుండెకు రక్తం సరఫరా జరుగుతుందని ప్రయోగ పూర్వకంగా వివరించాడు
ఇతను జీవశాస్త్రము ను పఠన స్థాయి నుండి ప్రయోగ స్థాయికి చేర్చడంలో కృషి చేసారు .
ఇతను శాస్త్రీయ పద్దతిని పాటించాడు .
ఆంటోనీ వాన్ లివెన్ హుక్
ఇతను డచ్ శాస్త్రవేత్త
ఇతన్ని" Father of Bacteriology "అంటారు
ఇతను మొదట మైక్రోస్కోపు వాడకాన్ని నిర్దేశించిన శాస్త్రవేత్త
ఇతను 1674 లో రక్తం ,నీరు ,దంతలపాచి ,శరీర ద్రవాలు ,మల పదార్థంలో మొదటగా సూక్ష్మజీవుల ఉనికిని ముఖ్యంగా" బాక్టీరియా" ను కనుగొన్నాడు
ఇతను 200 వరకు కటకాలు తయారు చేసి సూక్ష్మ జీవులను గమనించాడు
ఈ కటకాల సామర్థ్యం - 200-400 రేట్లు ఎక్కువ చూపించడం
లూయిస్ పాశ్చర్
ఇతను ఫ్రాన్స్ కు చెందిన శాస్త్రవేత్త
ఇతను ఫ్రాన్స్ కు చెందిన శాస్త్రవేత్త.
ఇతను సూక్ష్మజీవులపై ఎక్కువగా పరిశోధన చేసి సూక్ష్మజీవశాస్తానికి శాస్త్రానికి పితామహుడిగా పేరు పొందాడు.
ద్రాక్ష సారాయి చెడిపోవడానికి కారణం "సూక్ష్మజీవులే " అన్నాడు .
ద్రాక్ష సారాయి చెడిపోవడం అనగా" ఏకకణ శిలీంద్రం" ఉన్న ఈస్ట్ (yeast ) కిణ్వనం అనే ప్రక్రియ జరిపి alchohol ను ఏర్పర్చును .
పట్టుకోశాలు నాశనం కావడానికి కారణం కుడా సూక్ష్మజీవులే అని చెప్పి" నిర్మూలనపద్ధతి" ప్రతిపాదించాడు.
పాలను ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి" పాశ్చరైజేషన్" అనే ప్రక్రియకు రూపకల్పన చేశాడు .
ఈ ప్రక్రియలో పాలను 72°C &62. 8°C వద్ద 15 నిముషాలు వేడిచేసి 10°C దగ్గర చల్లార్చాలి.
దీనివల్ల" లాక్టోబాసిల్లస్" క్రియారహితంగా మారి పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి .
పాలను పెరుగుగా మార్చే బాక్టీరియా -"లాక్టోబాసిల్లస్"
గొర్రెలలో వచ్చే ఆంధ్రాక్స్ వ్యాధికి -"ఆంధ్రాక్స్ టీకా"
పిచ్చి కుక్క కాటు రేబిస్ వ్యాధికి -"రేబిస్ టీకా"
కలరా వ్యాధికి -" కలరా టీకా" ను తయారుచేశారు.
రోనాల్డ్ రాస్
ఇతను బ్రిటిష్ డాక్టర్.
ఇతను మలేరియా జ్వరం "ప్రోటోజోవా పరాన్న జీవి "ద్వారా కలుగుతుందని ప్రయోగ పూర్వకంగా వివరించాడు .
దీనికోసం 1902 లో రాస్ Nobel Prize ను పొందారు.
ఇతను పరిశోధన చేసినది సికింద్రబాద్ FEVER HOSPITAL.
1926 లో అతను రాస్ ఇనిస్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు.
హర్ గోవింద్ ఖురానా
Born: 9 January 1922, Raipur, Pakistan
Died: 9 November 2011, Concord, Massachusetts, United States
Awards: Louisa Gross Horwitz Prize, MORE
Education: University of Liverpool (1948), University of the Punjab (1945), University of the Punjab (1943), ETH Zurich, GCU
Books: Chemical biology
Nationality: American, English, Indian
ఇతను పంజాబ్ కు చెందిన వ్యక్తి .
అమెరికా లో పరిశోధన చేసి ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు తయారు చేసి 1968లో NOBEL బహుమతి పొందారు .
ఈ పరిశోధన అణుజీవ శాస్త్రానికి ఎంతో ఉపయోగపడింది .
యల్లాప్రగడ సుబ్బారావు
జననం: జనవరి 12,1895 ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం
మరణం :1948 ఆగస్టు
9 (వయసు 52)
ఇతను ఒక జీవరసాయన శాస్త్రవేత్త
ఇతని శతజయంతి ఉత్సవాలు జరిగిన సం ''1995
ఇతను తయారు చేసిన యాంటీబయోటిక్ -'"టెట్రాసైక్లిన్""
ఇది ప్లేగు వ్యాధిని నివారించే అద్భుత ఔషదం .
అందువల్ల సుబ్బారావు గారిని" అద్భుత ఔషద సృష్టికి మంత్రగాడు" అంటారు .
లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. Notes
కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు.
యం.యస్.స్వామినాధన్
జననం:1925 ఆగస్టు 7
అనగా వ్యవసాయ ఉత్పత్తులను , దిగుమతులను గణనీయంగా పెంచడం .
ఇతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు.
ఇతను"ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు
ఈ విప్లవం లో భాగంగా ప్రోత్సహించిన ధాన్యాలు -వరి ,గోధుమ వాణిజ్య పంటలు (బంగాళ దుంప ,పత్తి ,నారపంటలు ),అధిక గుజ్జు ,రసం ,విత్తనాలు లేని పండ్ల మొక్కలు .
1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో అతని పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది.
బీర్బల్ సహాని
జననం:14 నవంబరు 1891
మరణం :10 ఏప్రిల్ 1949
ఇతను లక్నో యూనివర్సిటీలో ప్రొఫసర్ .
ఇతను పూరాజీవశాస్త్ర o లో పరిశోధనలు చేశారు .
ఇతను పూరాజీవశాస్త్రానికి పితామహుడుగా పిలువబడ్డాడు .
పూరాజీవశాస్త్ర o అనగా ఒకప్పుడు నివసించి, ప్రస్తుతం విలుప్తమై శిలాజాలుగా లభ్యమయ్యే మొక్కలు ,జంతువుల అధ్యయనం .
ఉదా :ఎముకలు ,గుడ్లు ,గింజలు ,దంతాలు
ఇతను అల్పెైడ్ వాగ్నర్ ప్రతిపాదించిన ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువును ఇచ్చాడు .
1946 లో లక్నోలో బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటనీని స్థాపించాడు
పంచానన్ మహేశ్వరి
జననం :1904 నవంబరు 9
మరణం : 1966 మే 18
పంచానన్ జైపూరులో జన్మించాడు.
ఇతను ఢిల్లీ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ .
ఇతను మొక్కల పిండోత్పత్తి శాస్రానికి పితామహుడు .
ఇతను కణజాల వర్ధనం (పరిస్థానిక ,ఫలదీకరణ )లో పరిశోధనలు చేశారు .
అంజిస్పెర్మస్ ను టెస్ట్ ట్యూబ్‌లో పెంచే సాంకేతికతను ఆవిష్కరించినందుకు గాను ఆయన ప్రసిద్ధుడయ్యాడు.
ఈ ఆవిష్కరణతో గతంలో పెంచడానికి సాధ్యపడని కాని కొన్ని సంకర జాతి మొక్కలను కృత్రిమంగా పెంచగలిగారు.
Comments
Post a Comment